Vodafone Idea: మార్చి నుంచి వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు

మెరుగైన నెట్‌వర్క్‌తో పాటు తక్కువ ధరలతో 5జీ సేవలను అందించడం తమ లక్ష్యమని వొడాఫోన్ ఐడియా ప్రతినిధి ఒకరు చెప్పారు.

Update: 2025-01-02 15:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రైవేట్ రంగ టెలికాం కపెనీ వొడాఫోన్ ఐడియా ఆలస్యంగానైనా 5జీ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే 5జీ సేవల్లో దూకుడుగా ఉన్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ధీటుగా ప్లాన్‌లను అందించి యూజర్లను సంపాదించాలని వొడాఫోన్ ఐడియా భావిస్తంది. ఈ ఏడాది మార్చి నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మెరుగైన నెట్‌వర్క్‌తో పాటు తక్కువ ధరలతో 5జీ సేవలను అందించడం తమ లక్ష్యమని వొడాఫోన్ ఐడియా ప్రతినిధి ఒకరు చెప్పారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 75 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను తీసుకురానుంది. ప్రధానంగా ప్రీపెయిడ్ యూజర్లను లక్ష్యంగా ప్రణాళిక వ్యూహాన్ని కంపెనీ అనుసరించనున్నట్టు సమాచారం. అధికంగా డేటా వాడే పారిశ్రామిక ప్రాంతాలపై కంపెనీ దృష్టి సారించింది. కాగా, దేశీయ టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్ తర్వాత 5జీని తీసుకురావాల్సిన వొడాఫోన్ ఐడియా చాలాకాలంగా కష్టాల్లో ఉంది. 5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నప్పటికీ నిధుల కొరత వల్ల విస్తరణలో వెనుకబడింది. మరోవైపు జియో, ఎయిర్‌టెల్ కంపెనీల స్పీడ్ కారణంగా లక్షల్లో సబ్‌స్క్రైబర్లను కూడా కోల్పోయింది. దీన్ని అధిగమించేందుకు జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న దానికంటే 15 శాతం వరకు తక్కువ ధరకే ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించన్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News