అరుదైన వ్యాధితో జన్మించిన కవలలు.. తుమ్మినా, దగ్గినా విరుగుతోన్న ఎముకలు.. తల్లడిల్లిపోతున్న తల్లి
అమ్మ అవ్వడం ఒక అదృష్టం. అమ్మతనం గొప్ప అద్భుతం. అమ్మ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: అమ్మ అవ్వడం ఒక అదృష్టం. అమ్మతనం గొప్ప అద్భుతం. అమ్మ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. 9 నెలల పాటు తన గర్భంలో బిడ్డను మోసి.. పురిటి నొప్పులు భరించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అనుక్షణం కంటి రెప్పలా చూసుకుంటూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తన బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి తల్లి తన బిడ్డకు ఏమైనా అయితే తట్టుకోగలదా? తాజాగా ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన పిల్లల ఎముకలు గుడ్డు పెంకుల్లా అత్యంత సున్నితంగా ఉన్నాయి. తుమ్మినా, దగ్గినా.. కనీసం ఎత్తుకుని తిప్పినా సరే ఎముకలు విరిగి పోయేలా ఉన్నారు.
అయితే చిన్నారులకు రక్త పరీక్ష చేయగా.. ఆస్టియో జెనిసిస్ ఇంపర్ ఫెక్టా అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోన్నట్లు వెల్లడైంది. దీంతో పిల్లలు బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో ఈ కన్న తల్లి దు:ఖం వర్ణనాతీతం. ఈ వ్యాధి జీవితాంతం వెంటాడుతుంటూనే ఉంటుందని చెప్పినా.. తల్లి మాత్రం తన పిల్లల్ని ఎలాగైనా బాగు చేయాలని నిర్ణయించుకుని.. చికిత్స ఇప్పిస్తుంది. తల్లి గర్భం దాల్చిన 20 వారాల్లో పిల్లల కాళ్లు, చేతులు వంగినట్లు డాక్టర్లు చెబుతున్నారు.