Rahul and Revanth : హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర పోస్ట్ ఇదే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-05 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనపై మేధావులు, ప్రజలు, వివిధ సామాజిక వర్గాలతో సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. జోడో యాత్ర సమయంలో రాహుల్‌‌తో కాగడాలు చేతపట్టిన ర్యాలీ ఫోటోను సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. ‘బలహీనుడి గళం, సామాజిక న్యాయ రణం, రాహుల్ గాంధీకి స్వాగతం’ అంటూ ఫోటో షేర్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు మీ బాస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరికొంత మంది రాహుల్ గాంధీ అశోక్‌నగర్ రావాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, సాయంత్రం 4.45 గంటలకు రాహుల్ గాంధీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోని అక్కడి నుంచి పీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలో నిర్వహించనున్న కులగణన సదస్సుకు భారీ ర్యాలీగా వెళ్తారు. అక్కడ కులగణన విధి విధానాలు, సామాజిక న్యాయం, పలు అంశాలపై మేధావులు, ప్రజాసంఘాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మీటింగ్ తర్వాత రాత్రి 7:10 గంటలకు రోడ్డు మార్గం గుండా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి రాహుల్ వెళ్తారు.

Tags:    

Similar News