Viral Video : ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలే బాగా చేస్తారు!!
Viral Video : ఆ విషయంలో పురుషుల కంటే స్త్రీలే బాగా చేస్తారు!!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మీరు నేలపై పడుకుని.. మోకాళ్లపై, మోచేతులపై నిలబడాల్సి ఉంటుంది. తర్వాత ఒక్కొక్కొ చేతిని వీపు వెనుక భాగానికి తీసుకువెళ్లాలి. అలా రెండు చేతులను వీపు భాగంపైకి పంపి బ్యాలన్స్‌డ్‌గా ఉంటే మీరు ఈ ఛాలెంజ్ గెలిచినట్లే. అయితే, ఈ ఛాలెంజ్‌ను పురుషుల కంటే మహిళలు సులభంగా చేయగలుగుతారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో చూద్దాం.
బాడీ ఫ్యాట్‌లో తేడాల వల్లే..
బ్యాలన్స్‌డ్ ఛాలెంజ్‌లో స్త్రీలు గెలవడానికి కారణం.. వారి శరీర నిర్మాణం, కొవ్వు నిల్వ ఉండే ప్రాంతాలని నిపుణులు చెబుతున్న మాట. మహిళలకు కొవ్వు సాధారణంగా వారి తుంటి, తొడల చుట్టూ ఉంటుంది. అయితే, పురుషులకు భుజాలు, ఛాతీ, పొట్ట వంటి భాగాల్లో ఎక్కువ కొవ్వు చేరుతుంటుంది. అందుకే పురుషుల కంటే స్త్రీలపై గుర్వత్వార్షణ తక్కువగా ఉంటుంది.
శరీర ద్రవ్యరాశి కీ రోల్
బ్యాలన్స్‌డ్ ఛాలెంజ్‌లో పురుషులు గెలవకపోవడానికి కారణం వారు అధిక కండర ద్రవ్యరాశిని కలిగి ఉండటంతోపాటు కొవ్వ నిల్వ ఉండే ప్రాంతాలు పొట్టకు పైభాగంలో ఉండటం వల్ల ముందుకు పడిపోతారు. అయితే, స్త్రీలలో అధిక ద్రవ్యరాశితోపాటు కొవ్వు ప్రాంతాలు తుంటి, తొడల వల్ల ముందుకు పడిపోకుండా బ్యాలన్స్‌డ్‌గా ఉంటారు.
ఫిట్‌నెస్ కోసం నిపుణుల సూచనలు
*ప్లాంక్‌లు, స్టెబిలిటీ బాల్ వర్కౌట్‌లు చేస్తే మీ శరీరం బ్యాలన్స్ చేయవచ్చు.
* స్క్వాట్స్‌తోపాటు చెస్ట్ దిగువ భాగానికి ఉపయోగపడే వ్యాయామాలు చేయడం మంచిది.
* బోసు బాల్స్ (Bosu balls)వంటి పరికరాలను ఉపయోగించి శరీరాన్ని బ్యాలన్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి.
* రోజువారీ కార్యకలాపాలను ప్రతిబింబించే ఫంక్షనల్ కదలికలు చేయాలి.
This Video credits to djpupdawg Gravity challang Insta Id