Journey : ప్రయాణాల వేళ.. కునుకు తీస్తారెలా..?!
Journey : ప్రయాణాల వేళ.. కునుకు తీస్తారెలా..?!
దిశ, ఫీచర్స్ : బస్సులో, ట్రైన్‌లో, కారులో వెహికల్ ఏదైనా అందులో జర్నీ చేయాలంటే కొందరు భయపడుతుంటారు. వాహనాల శబ్దం, వాతావరణం పడక వాంతులు, తలనొప్పి, వికారం వంటివి కలుగుతుంటాయి. కానీ మరి కొందరికి అలాంటిదేమీ ఉండదు. ఇంకొందరు ప్రయాణం చేస్తుంటే తమకేదీ పట్టనట్టు హాయిగా నిద్రపోతారు. అసలు ఇలా నిద్రపోవడానికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసి స్థితిలో మార్పు
ప్రయాణంలో ఉన్నప్పుడు అలసిపోవడం వల్ల నిద్ర రావడం సహజం. అయితే అలసిపోకపోయినా నిద్రముంచుకొచ్చే వారు కూడా ఉంటారు. జర్నీలో ఉన్నప్పుడు క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తుంటారు. కాగా ‘హైవే హైప్రోరిస్’ అనే మానసిక స్థితికి లోనుకావడంవల్ల అలా జరుగుతుందని మానసిక ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
పరిస్థితుల ప్రభావం కూడా..
నిజానికి ఆయా వ్యక్తులు పుట్టి పెరిగిన వాతావరణం, ఆలోచనలతీరు, కుటుంబ, సామాజిక పరిస్థితులు, సానుకూల, ప్రతికూల ఆలోచనలు వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. కొన్ని మనసులో బలంగా నాటుకుపోవడం వారి వ్యక్తిత్వం, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. ‘హైవే హైప్రోరిస్’ అనే మానసిక స్థితికి అదే కారణం అంటున్నారు. వీరు ఏదైనా తమకు ఆనందం లేదా ఉత్సాహం కలిగించే సందర్భంలో అప్పటి వరకు ఉన్న భయాలు, బాధలను వెంటనే మర్చిపోతారు. దీంతో చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. జర్నీలో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి చక్కగా నిద్రపోతారు. అలాగే కొన్ని సార్లు నిద్రలేమి కూడా జర్నీలో కునుకు తీయడానికి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.