సొంతంగా మందులు వాడేస్తున్నారా..? అయితే, ప్రమాదమే..!

దగ్గు, జలుబు, తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చాలామంది సొంతంగా మందులు వాడుతుంటారు.

Update: 2024-11-23 13:43 GMT

దిశ, ఫీచర్స్: దగ్గు, జలుబు, తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చాలామంది సొంతంగా మందులు వాడుతుంటారు. చిన్న సమస్యకు మందులు వాడితే సరిపోతుందిలే అని వాళ్లే డిసైడ్ అవుతారు. లేదంటే ఎవరో చెప్పిన మాటలను, ఇంటర్నెట్‌లో చూసినవో వాడేస్తుంటారు. చిన్న సమస్యయే కదా అని వైద్యుల దగ్గరికి వెళ్లకుండా మెడికల్ షాప్ వెళ్లి సొంతంగా మందులు తెచ్చుకొనే ధోరణి ఇటవల కాలంలో పెరిగిపోయింది. అయితే, ఇలా చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించకుండా మందులు వాడితే, శరీరంపై దుష్ఫ్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సొంతం వైద్యం చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కొందరు వైద్యుల వద్దకు వెళితే ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి, సొంతంగా మందులు తీసుకొని వాడుతుంటారు. అయితే, దీని వల్ల శరీరంలో యాంటీ బయోటిక్ నిరోధం, మందులకు బాగా అలవాటు పడుతుంది. దీని వల్ల ప్రతీ సారి చిన్న చిన్న వాటికే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. వయస్సు, జబ్బు లక్షణాల ఆధారంగా మోతాదుల్లో మార్పులు ఉంటాయి. కొందరు అవసరం లేకపోయినా యాంటీ బయాటిక్స్‌ను తరుచుగా వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఇన్‌ఫెక్షన్ల బారినపడితే, అప్పుడు ఈ యాంటీ బయాటిక్స్ వేసుకున్నా ఫలితం ఉండదు. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ తీవ్రత మరింత పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఒక వేళ వైద్యులను సంప్రదించకుండా టాబ్లెట్స్ వాడితే, కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు తీసుకునే టాబెట్లు సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయా లేదా అనేది తెలుసుకోవాలి. మందులపై ఉన్న అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి. టాబ్లెట్ వేసేకునేటప్పుడు సరైన డోస్ తీసుకోవడం మంచిది. వీటిని కొనే ముందు ఒకసారి మెడికల్ షాప్‌లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని ఉపయోగించాలి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

ఈ టాబ్లెట్‌ను అతిగా వాడుతున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి!


Tags:    

Similar News