Dating robot : రొబోతో రొమాన్స్.. ఆ పని కోసం లక్షలు ఖర్చుపెట్టి..!

Dating robot : రొబోతో రొమాన్స్.. ఆ పని కోసం లక్షలు ఖర్చుపెట్టి..!

Update: 2025-03-22 07:08 GMT
Dating robot : రొబోతో రొమాన్స్.. ఆ పని కోసం లక్షలు ఖర్చుపెట్టి..!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య టెక్నాలజీ (Technology) ఎంతగా డెవలప్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏఐ (AI) చేస్తున్న కొన్ని అద్భుతాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రజల్లో క్యూరియాసిటీ(Curiosity)ని పెంచుతున్నాయి. ఆయా రంగాల్లోనూ, వ్యక్తిగత అవసరాల్లోనూ ఏఐ ఆధారిత రోబోట్‌లు (AI-based robots) కీలకంగా మారుతున్నాయి. తమ అవసరాలకు వాటి ఉపయోగించుకునే వారికి సౌకర్యంగా నిలుస్తున్నాయి.

ఒకప్పుడు కొన్ని సేవలకే పరిమితమైన ఏఐ రోబోట్‌లు (AI robots)ఇప్పుడు ఇంటి పని, వంటపని చివరికి శృంగార కోరికలు (Romantic desires) తీర్చడంలోనూ అచ్చం మనుషుల్లా వ్యహరిస్తున్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఓ సంఘటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతూ నెటిజన్లను ఆశ్చర్య పర్చడంతో పాటు భవిష్యత్‌లో ఏఐ టెక్నాలజీ పాత్రపై, ప్రాధాన్యతపై ఆసక్తి పెంచుతోంది.

వైరల్ సమాచారం అండ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్, చైనీస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన జాంగ్ జెన్యువాన్ తన ఇంటి పనికోసం ₹1.15 లక్షలు పెట్టి G1 అనే పేరుగల ఒక హ్యూమనాయిడ్ రోబోట్‌(Humanoid robot)ను అద్దెకు తీసుకున్నాడు. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. ఇక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. ఆ రోబోట్ అచ్చం మనిషిలా వ్యవహరించినప్పటికీ, కొన్ని పనులు చక్క బెట్టడం, మరికొన్ని పనులను తిరస్కరించడం చేసిందట. దీంతో ఇద్దరి మధ్య సంభాషణలో మనుషుల మాదిరే తగాదాలు వచ్చేవి.

అసలు విషయం ఏంటంటే.. తనకు తెలియకుండానే జాంగ్ జెన్యూన్ ఆ G1 రోబోట్‌తో ప్రేమలో పడిపోయాడు. అద్దెకు తీసుకు వ్యవధి ముగిసినప్పుడు దానిని తీసుకున్న యాజమాన్య కంపెనీకి తిరిగి ఇవ్వడానికి ఏమాత్రం మనసొప్పలేదని పేర్కొన్న జాంగ్ జెన్యువాన్, చివరికి మళ్లీ దానిని డేటింగ్ కోసమని అద్దెకు తీసుకున్నాడు. దానితో రొమాంటిక్ అనుభూతిని పొందుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అతను సదరు రోబోట్‌తో ప్రస్తావించగా ‘‘హలో మిస్టర్ జాంగ్, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’’ అని బదులివ్వడంతోపాటు ఆ రోబోట్ శృంగారపరమైన అనేక విషయాలను పంచుకోవడంతో అతను ముగ్దుడైపోయాడు. ఇక సదరు రోబోట్‌ను విడిచి ఉండలేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యూచర్‌లో ఏఐ ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందోనని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Read More..

Elon Musk : కులీనా... ది బెస్ట్ రోబో చెఫ్ : మస్క్  

Human Evolution: 1000ఏళ్ల తర్వాత మానవ శరీరం ఇలా మారుతుంది.. షాకింగ్ చిత్రాలను చూపించిన సైంటిస్టులు  

Tags:    

Similar News