Human Evolution: 1000ఏళ్ల తర్వాత మానవ శరీరం ఇలా మారుతుంది.. షాకింగ్ చిత్రాలను చూపించిన సైంటిస్టులు

Human Evolution: ఈ భూమి మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు.

Update: 2025-03-22 06:46 GMT
Human Evolution: 1000ఏళ్ల తర్వాత మానవ శరీరం ఇలా మారుతుంది.. షాకింగ్ చిత్రాలను చూపించిన సైంటిస్టులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Human Evolution: ఈ భూమి మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. భూమి మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవ జాతులు ఆదిమానువుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలో మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇదంతా జరిగినట్లు 1000 సంవత్సరాల తర్వాత మానవ శరీరం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గత వెయ్యేళ్ల చరిత్రను చూసుకుంటే మానవ జాతి అనేది ఆదిమానవుల నుంచి ప్రారంభమైందని చదువుకున్నాం. కానీ రాబోయే 1000 సంవత్సరాల తర్వాత అసలు మానవులు ఎలా ఉంటారు? మానవ శరీరం ఎలా ఉంటుంది?

ప్రపంచం మానవులు ఇద్దరూ వేగంగా మారడానికి సాంకేతికత,అంతరిక్ష ప్రయాణం, వాతావరణ మార్పులు ఈ మూడు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ మార్పుల ప్రభావం మావన శరీర నిర్మాణంపై ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యంపై కనిపిస్తుందని అంటున్నారు. లండన్ యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ థామస్ ప్రకారం, మానవులు త్వరగా పరిపక్వం చెందడం ప్రారంభిస్తే, వారు తమ జీవితకాలంలో ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేస్తారు. చిన్న వయసులోనే పరిణతి చెందిన వ్యక్తులు ఎత్తు తక్కువగా ఉంటారని శాస్త్రీయ అధ్యయనాలు చూపిస్తున్నాయి. పొట్టి పొట్టి తన జన్యువులు భవిష్యత్తులో మరింత ఆధిపత్యం చెలాయిస్తాయని భవిష్యత్తులో మానవుల సగటు ఎత్తు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇప్పుడంతా సాంకేతికతే ప్రపంచం. సాంకేతికతపై ఆధారపడటం, తప్పుడు జీవనశైలి కారణంగా, మానవుల శారీరక నిర్మాణం కూడా మారే అవకాశం ఉందంటున్నారు. ఫోన్, కంప్యూటర్‌లో ఎక్కువసేపు పనిచేయడం వల్ల ప్రజలు వెన్ను వంగిపోతారు. అలాగే, వేళ్లు ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంటే, అవి పంజా లాంటి ఆకారంలోకి మారుతాయని చెబుతున్నారు. అంతేకాదు నిద్ర లేకపోవడం వల్ల మానవ శరీరంలో అనేక ప్రధాన మార్పులు సంభవిస్తాయి. నేటి వేగవంతమైన జీవనశైలి, డిజిటల్ ప్రపంచం కారణంగా, ప్రజల నిద్ర సమయం తగ్గుతోంది. దీని కారణంగా, భవిష్యత్తులో మానవుల మానసిక, శారీరక నిర్మాణంపై లోతైన ప్రభావం ఉంటుందంటున్నారు.

న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ బ్రూక్స్ ప్రకారం, భవిష్యత్తులో మానవ మెదడు చిన్నదిగా మారవచ్చు. సాంకేతికతపై ఆధారపడటం పెరుగుతున్నందున, మానవులకు అంత పెద్ద మెదడు అవసరం ఉండదు. ఎందుకంటే కంప్యూటర్లు, యంత్రాలు వాటి అనేక పనులను అవే చేసేస్తుంటాయి. కాబట్టి మానవ మెదడుతో అంతగా అవసరం ఉండదని చెబుతున్నారు. ఇక భవిష్యత్తులో, మానవులు ఎక్కువ కాలం అంతరిక్షంలోనే ఉంటే.. గురుత్వాకర్షణ లోపం వల్ల వారి ఎముకలు బలహీనపడతాయి. ఎక్కువసేపు అంతరిక్షంలో ఉండటం వల్ల శరీర ఎత్తు పెరుగుతుంది. కానీ కండరాలు..ఎముకలు మునుపటి కంటే సన్నగా, బలహీనంగా మారుతాయి.

మానవులు నెమ్మదిగా తమను తాము మచ్చిక చేసుకుంటున్నారని బాత్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రవేత్త డాక్టర్ నికోలస్ లాంగ్రిచ్ అంటున్నారు. గొర్రెలు, ఆవులు, కుక్కలను పెంపకం చేసినప్పుడు, వాటి మెదడు పరిమాణం 24శాతం నుండి 30శాతం వరకు తగ్గిందని అధ్యయనాలు కనుగొన్నాయి. అదేవిధంగా, ఈ మార్పు మానవ మెదడులో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో మానవులు వంగి నడవడం, గాల్లో తేలడం, ఆలోచించే విధానం తగ్గడం, మరుగుజ్జుల్లా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Read More..

Technology : పబ్లిక్ ప్లేస్‌లో పర్సనల్ విషయాలు.. మీకు మాత్రమే వినబడేలా..!  

Tags:    

Similar News