గర్భాశయాన్ని డిటాక్స్ చేసే మ్యాజిక్ డ్రింక్.. PCOD/PCOS సమస్యకు సహాజ మార్గాలతో చెక్ పెట్టండి?
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOD/PCOS) అనేది చాలా మంది మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ హార్మోన్ల రుగ్మత.

దిశ, వెబ్‌డెస్క్: పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOD/PCOS) అనేది చాలా మంది మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ హార్మోన్ల రుగ్మత. ఇది క్రమరహిత రుతుక్రమం, బరువు పెరగడం, మొటిమలు, సంతానోత్పత్తి సమస్యల్ని కలిగిస్తుంది. వైద్య చికిత్స తప్పనిసరి అయినప్పటికీ.. కొన్ని సహజ నివారణలతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాగా ఇందుకోసం జీలకర్ర, అజ్వైన్ (కరోమ్ గింజలు), అడ్రాక్ (పొడి అల్లం పొడి), నెయ్యి తీసుకోవాలి. వీటన్నింటిని మరిగించి.. ఒక డబ్బాలో నిల్వ చేసుకుని ప్రతి రోజూ ఒకసారి తీసుకుంటే గర్భాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే PCOD లక్షణాలను తగ్గిస్తుంది. ఈ పానీయం గర్భాశయ డీటాక్స్, PCOD కి ఎలా మద్దతు ఇస్తుందో చూసినట్లైతే..
ఈ పానీయంలోని ప్రతి పదార్ధం హార్మోన్లను సమతుల్యం చేయడంలో.. పునరుత్పత్తి వ్యవస్థను శుభ్రపరచడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర ఉబ్బరం తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో.. PCODలో తరచుగా అసమతుల్యత చెందే ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
అజ్వైన్ (కరోమ్ విత్తనాలు) జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది, జీవక్రియను పెంచుతుంది. శరీరం నుంచి అదనపు విషాన్ని తొలగించడంలో తోడ్పడుతుంది.ఇక అడ్రాక్ పౌడర్ (ఎండిన అల్లం) ఋతుక్రమ నొప్పిని తగ్గిస్తుంది. నెయ్యి హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. అవసరమైన పోషకాలను గ్రహించడానికి మేలు చేస్తుంది.
ఈ మ్యాజిక్ డ్రింక్ ఎలా తయారు చేయాలి?
½ టీస్పూన్ జీరా మరియు ½ టీస్పూన్ వాము తీసుకోండి. ¼ టీస్పూన్ ఎండు అల్లం పొడి జోడించండి. తర్వాత ఒక పాన్ లో ½ టీస్పూన్ నెయ్యి వేడి చేసి, సుగంధ ద్రవ్యాలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. పాన్ లోకి ఒక కప్పు వాటర్ పోసి, పరిమాణం సగానికి తగ్గే వరకు మరిగించాలి. తర్వాత వడకట్టి వేడి వేడిగానే తాగాలి. మీరు దీన్ని రోజుకు ఒకసారి తప్పకుండా ఖాళీ కడుపుతో తాగాలిన నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పానీయం వల్ల ఎవరు ప్రయోజనం పొందవచ్చు?
పీరియడ్స్ సరిగ్గా రాలేనివారు లేదా తక్కువ ఋతు ప్రవాహం ఉన్న స్త్రీలు PCOD కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఎదుర్కొంటున్నవారు ఉబ్బరం, అజీర్ణం లేదా విషం పేరుకుపోవడం వంటి సమస్యలు ఉన్న స్త్రీలు పునరుత్పత్తి ఆరోగ్యానికి ఈ సహజ మార్గం మేలు చేస్తుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.