Beauty Tips: చర్మం మెరవాలంటే క్యారెట్‌ను ఇలా వాడడండి!
చలికాలంలో చర్మానికి క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.
దిశ, ఫీచర్స్: చలికాలంలో చర్మానికి క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. చర్మంపై మచ్చలను తగ్గించి స్కిన్‌ను మెరిపిస్తుంది. శీతాకాలంలో చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. వాటన్నింటిని తగ్గించడంలో క్యారెట్ సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో మీ చర్మం మెరిసిపోవాలంటే క్యారెట్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకోండి.
హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్: ముందుగా క్యారెట్‌ను తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం తేనెను మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి మూడు రోజులు పాటు చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
క్యారెట్ జ్యూస్: చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు క్యారెట్ సహయపడుతుంది. ఇందులో ఉండే కెరొటీనాయిడ్స్ సూర్యుని యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. క్యారెట్ జ్యూస్ తాగడం ఇబ్బందిగా అనిపించిన వారు దీనిని టోనర్‌గా ఉపయోగించవచ్చు. దీని కోసం కప్పు క్యారెట్ రసం, మరో కప్పు బీట్ రూట్ రసం, ఒక స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి. వీటన్నింటిని స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగి, చర్మంపై స్ప్రే చేయండి. ఇలా 20 నిమిషాల పాటు అరనిచ్చి, శుభ్రంగా కడిగేయండి.
క్యారెట్ ఫేస్ ప్యాక్: కొంతమందికి వయస్సు పెరుగుతున్న కొద్ది ముఖంపై ముడతలు వస్తుంటాయి. అలా రాకుండా ఉండటానికి ఈ క్యారెట్ ఫేస్ ప్యాక్ చేసుకుంటే స్కిన్ బిగుతుగా మారుతుంది. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ పెరుగులో క్యారెట్ జ్యూస్ మిక్స్ చేసుకొని, అందులో ఒక స్పూన్ తేనెను కలపాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.
ఫేస్ వాష్: చాలామంది చర్మానికి రకరకాల ఫేస్ వాష్‌లు ఉపయోగిస్తుంటారు. ఇలా బయట వాటికంటే ఇంట్లోనే సహజసిద్ధమైన ఫేస్ వాష్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గాజు సీసాలో క్యారెట్ పౌడర్, ముల్తానీ మట్టిని మిక్స్ చేసి ఉంచండి. ఫేస్ వాష్ చేసుకోవాలని అనుకున్నప్పుడు కొద్దిగా ఈ పొడిని తీసుకుని, అందులో కొంచెం నీళ్లు పోసి, పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తరువాత ముఖానికి రుద్ది కడిగేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది. చర్మానికి ఎటువంటి హాని కలిగించడకుండా, స్కిన్‌కు పోషణ అందించడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది.
Read More...
Sugar levels: రాత్రిపూట ఈ తప్పులు చేస్తున్నారా.. ఈ వ్యాధి మరింత కొనితెచ్చుకున్నవారౌతారు..!!