Thunder killed Player: పిడుగుపడి ఆటగాడి మృతి.. గ్రౌండ్‌లో నడుస్తుండగా నేరుగా తాకిన పిడుగు
అప్పటివరకు హ్యాపీగా ఫుట్‌బాల్ ఆడుకున్నాడు. తోటి ఆటగాళ్లతో కలిసి సరదాగా మాట్లాడుతూ కేరింతలు కొట్టాడు.
దిశ, వెబ్‌డెస్క్: అప్పటివరకు హ్యాపీగా ఫుట్‌బాల్ (Football) ఆడుకున్నాడు. తోటి ఆటగాళ్లతో కలిసి సరదాగా మాట్లాడుతూ కేరింతలు కొట్టాడు. కట్ చేస్తే.. ఒక్క క్షణంలో ఒళ్లంతా కాలిపోయి ప్రాణాలు పోయి శవంగా మారి పడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం నాడు పెరూ (Peru)లో క్లబ్ జువెన్‌టుడ్ బెల్లవిస్టా, ఫెమీలియా చోకా మధ్య హవున్‌కావో సిటీలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్లుండి భారీ వర్షం (Rain) పడడంతో రిఫరీ మ్యాచ్ ఆపేసి ఆటగాళ్లని వెనక్కి పంపించసాగాడు. అదే టైంలో రిఫరీతోపాటు 39 ఏళ్ల ఆటగాడు జోస్ హ్యూగో డి లా క్రూజ్ మెసా కూడా మైదానం వీడసాగాడు. అప్పుడే హఠాత్తుగా ఓ పిడుగు మెసాపై పడింది.
ఆ పిడుగు దెబ్బకి అతడు అక్కడికక్కడే చరిపోయాడు. ఇక అతడికి దగ్గరగా నడుస్తున్న ఐదుగురు ఆటగాళ్లు, రిఫరీ అందరూ మెరుపు ప్రభావానికి ఒక్కసారిగా కుప్పకూలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం నాడు జరిగిన ఈ ఘటనతో క్రీడా ప్రపంచంలో విషాద ఘటనగా పేర్కోవచ్చు. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలో ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పాటు కారణంగా ఒక ఆటగాడు మరణించాడు. అంతేకాకుండా, రిఫరీ సహా పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నవంబర్ 3న జరిగిన ఈ ఘటనతో క్రీడా లోకం విస్తుపోయింది.