700 మంది అమ్మాయిలను మోసం చేశాడు.. చివరికి ఏమైందంటే?

మోడల్ ముసుగు వేసుకుని అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్న వ్యక్తి గుట్టు రట్టైంది.

Update: 2025-01-04 11:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: మోడల్ ముసుగు వేసుకుని అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్న వ్యక్తి గుట్టు రట్టైంది. తాను US మోడల్‌నని చెబుతూ 700 మంది అమ్మాయిలను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన తుషార్(23) డేటింగ్ యాప్స్, స్నాప్‌చాట్ నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫొటోలను పెట్టుకుని అనేక మంది యువతులను బుట్టలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అమ్మాయిల నుంచి న‌మ్మ‌కం గెలిచుకొని వారి ఫోన్ నెంబ‌ర్లు తీసుకునేవాడు. ఆ త‌ర్వాత స్నేహం పేరుతో ర‌హ‌స్య ఫోటోలు, వీడియోల‌ను అడిగేవాడు.

ఆ విజువ‌ల్స్‌ను అత‌ను త‌న ఫోన్‌లో సేవ్ చేసుకునేవాడు. మొదటగా వ్య‌క్తిగ‌త సంతోషం కోసం చేసినా.. ఆ త‌ర్వాత అత‌ను బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. త‌న వ‌ద్ద ఉన్న వీడియోల‌ను చూపించి డ‌బ్బు కోసం బెదిరించేవాడు. ఒక‌వేళ ఎవ‌రైనా డ‌బ్బులు ఇవ్వన‌ని బెదిరిస్తే, అప్పుడు అత‌ను ఫొటోలు, వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తాన‌ని బెదిరించేవాడు. ఇలా బంబుల్‌లో 500 మంది, స్నాప్ చాట్లో 200 మంది యువతులతో స్నేహం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. వారి ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్లు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేసేవాడని ఓ యువతి ఫిర్యాదుతో అతని బండారం బయటపడింది. తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News