షాపులో పని చేయడానికి రానివ్వలేదని ఆత్మహత్య
మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన నందిని ( 28 ) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
దిశ, మధిర : మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన నందిని ( 28 ) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నందిని మధిరలో దుర్గా రెడీమేడ్ షాపులో గుమస్తాగా పనిచేస్తుంది. జనవరి ఒకటిన షాపునకు రానందుకు గాను తరువాత పని చేసేందుకు వచ్చిన నందిని పట్ల ఓనర్ అనుచితంగా ప్రవర్తించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి న్యాయం చేయాలంటూ బంధువులు షాప్ ముందు ఆందోళన చేపట్టారు.