మావోయిస్టుల ఘాతుకం... మందుపాతర పేలి 9 మంది మృతి
ఛత్తీస్గడ్ లో మావోయిస్టులు ఘతుకానికి తెగబడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చి వేయడంతో 9 మంది మృతి చెందారు.
దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ లో మావోయిస్టులు ఘతుకానికి తెగబడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చి వేయడంతో 9 మంది మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలోని కుట్రూ ఖేద్రే రహదారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వాహనంలో మొత్తం 15 మంది జవాన్లు ఉండగా వారిలో 9 మంది మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. మిగిలిన జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయు. భద్రతా బలగాలు సంఘటనా స్థలంకు చేరుకొని గాయపడిన జవాన్లను బీజాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గడ్ లో యుద్ధవాతావరణం నెలకొంది.