Trending: భూమిలో నుంచి వచ్చిన పొగలు.. ఆశ్చర్యపోయిన జనం (వీడియో)

‘నిప్పు లేనిదే పొగ రాదు’ అనే నానుడి నిజమో కాదో తెలియదు కాని.. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది.

Update: 2024-09-06 03:07 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అనే నానుడి నిజమో కాదో తెలియదు కాని.. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి నగర వ్యాప్తంగా వర్షం కురిసింది. ఈ క్రమంలోనే కేబీఆర్ పార్క్ వద్ద భూమి పొరల్లోంచి పొగలు బయటకు రావడం చూసి అక్కడున్న జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. మొదటి తక్కువగా వచ్చిన పొగలు.. క్రమక్రమంగా పెరిగాయి. దీంతో అసలు భూమి లోపల ఏం జరుగుతోందని అందరూ అయోమయానికి గురయ్యారు. ఈ వింత ఘటన చూసేందుకు వాహనదారులు ఎగబడటంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, ఇటీవలే అదే ప్రాంతంలో అండర్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 కేవీ కేబుల్‌ను అమర్చినట్లుగా తెలుస్తోంది. కాగా, ఆ కేబుల్ డ్యామేజ్ అయి షాట్ సర్క్యూట్‌తో పొగలు వస్తున్నాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి:  https://x.com/bigtvtelugu/status/1831885233702211843


Similar News