Trending: ఓర్నీ.. పిల్లులు కాదండోయ్.. గవర్నమెంట్ ఆఫీసర్లు.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో

సాధారణంగా కొంత మంది ఇళ్లల్లో పిల్లుల్ని పెంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

Update: 2024-08-25 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కొంత మంది ఇళ్లల్లో పిల్లుల్ని పెంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం. తమ సొంత పిల్లల్లాగానే పిల్లులకు కూడా సపరేట్ ఫుడ్, బెడ్ వంటివి అరెంజ్ చేస్తారు. ఇక పల్లెటూర్లలో అయితే అసలు ఏదైనా మంచి కార్యం కోసం బయటకు వెళ్ళేటప్పుడు అవి ఎదురు వస్తే దరిద్రం లాగా ఫీల్ అవుతుంటారు. అలా ఒక్కొక్క దగ్గర వాటికి ఒక్కో విధంగా గౌరవం అందుతుంది.

అయితే ప్రస్తుత కాలంలో మన దేశంలో ఎన్ని డిగ్రీలు చేసిన గవర్నమెంట్ జాబ్ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఇష్టం లేకున్నా బతుకుతెరువు కోసం చాలీచాలని జీతంతో ప్రైవేట్ జాబ్‌లో జాయిన్ అయిపోతున్నారు. మరి మన దేశంలో ఇలాంటి సిట్యువేషన్ ఉంటే.. ఈ దేశంలో మాత్రం పిల్లులకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మరీ పోషిస్తున్నారు. ఏంటి పిల్లులు జాబ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే.

sanjutelugufacts అనే ఈ వీడియో ప్రకారం.. ఇజ్రాయెల్ దేశంలో పిల్లులకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి వాటికి జీతం కింద మంచి ఫుడ్ పెడుతున్నారు. అయితే అసలు వాటి పని ఏంటంటే.. రైల్వే స్టేషన్‌లో పాసింజర్ టికెట్స్ చెక్ చేయడం. ఇన్‌కేస్ ఎవరైన టికెట్ చూపించకుండా వెళ్లిపోతుంటే కనున వారిని పిల్లులు ఆపడం గమనార్హం. మరి ఆ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందంటే.. ఆ దేశంలో క్యాట్స్ పాపులేషన్ ఎక్కువైపోయిందట. అయితే వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేది ఏమీ లేక వాటికి ఇలా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి రైల్వే స్టేషన్‌లో టీసీ పోస్ట్‌ను ఇచ్చేసారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరు ఆ వీడియోను చూసేయండి.

(video link credits to sanjayfactstelugu instagram id)


Similar News