Trending: ముసలోడే కానీ మహానుభావుడు..! ఆయన లవ్ ప్రపోజల్‌ ముందు కుర్రాళ్లు బలాదూర్

ప్రేమకు జాతి, కులం, మతం వంటి భేధాలు లేవు. కానీ ఈ వీడియో చూస్తే వయసుతో కూడా సంబంధం లేదు అని అనక ఉండలేరు.

Update: 2024-08-28 07:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమకు జాతి, కులం, మతం వంటి భేధాలు లేవు. కానీ ఈ వీడియో చూస్తే వయసుతో కూడా సంబంధం లేదు అని అనక ఉండలేరు. ప్రస్తుతం తాత బామ్మకు క్యూట్‌గా ప్రపోజల్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఒక వృద్ధుడు తన భార్యను కుటుంబ సభ్యులందరి ముందు "డార్లింగ్ (Darling)" అని చాలా ప్రేమగా పిలిచాడు. అతడి పిలుపులో ప్రేమ కనిపించింది. అయితే అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయి.. నవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో ఆ బామ్మ సిగ్గుతో నోరు మూయండి ఇక అని ఆ తాతను అంటుంది. అక్కడితో ఈ వీడియో అయిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఇది కదా నిజమైన ప్రేమ అని, మీరు ఎల్లప్పుడు ఇంతే హ్యాపీగా ఉండాలంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ వీడియోకు 2.5 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.

(video link credits to prachi.chugh instagram id)


Similar News