Trending: ఆరు అడుగుల ఐఫోన్‌ను తయారు చేసిన కంటెంట్ క్రియేటర్.. కట్ చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

సాధారణంగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ పొడవు 6.29 అంగుళాలు ఉంటుంది.

Update: 2024-09-11 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ పొడవు 6.29 అంగుళాలు ఉంటుంది. చూసేందుకు స్లిమ్‌గా చేతిలో పట్టుకుంటే ఇట్టే ఇమిడేలా యాపిల్ సంస్థ (Apple Company) ఆ ఫోన్‌ను డిజైన్ చేసింది. అయితే, తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌ను తయారు చేసి ఏకంగా ఓ వక్తి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్ట్ (Guinness Book of Record)లో స్థానం సంపాదించాడు. వివరాల్లోకి వెళితే.. బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ (Arun Rupesh Maini), గాడ్జెట్ బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్‌ (Matthew Perks) తో కలిసి 6.74 అడుగుల ఎత్తుతో ఐఫోన్‌ను తయారు చేశాడు. అయితే, అచ్చం ఐఫోన్‌ను పోలి ఉన్న ఆ భారీ ఫోన్ ఐఓఎస్ (IOS) సాఫ్ట్‌వేర్‌తో సెక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ను రూపొందించిన అరుణ్ రూపేష్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ స్థానం సంపాదించాడు. అయితే, అందుకు సంబంధించిన వీడియోను అరుణ్ ఇటీవలే ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్  చేయండి: https://x.com/bigtvtelugu/status/1833700527789510903


Similar News