ILLEGAL RELATIONSHIP: అఫైర్ పెట్టుకున్న భార్యను సీక్రెట్ కెమెరాతోనే పట్టుకున్న భర్త.. కానీ, కోర్టులో దిమ్మతిరిగే షాక్

సాధారణంగా ఒక్కో దేశంలో ఒక్కో చట్టం ఉంటుంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం చిత్ర విచిత్రమైన చట్టాలు ఉంటాయి.

Update: 2024-08-24 05:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఒక్కో దేశంలో ఒక్కో చట్టం ఉంటుంది. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం చిత్ర విచిత్రమైన చట్టాలు ఉంటాయి. అయితే అలాంటి చట్టాలకు లోబడి ఎన్నైనా అన్యాయమైన పనులు చేయవచ్చు. కానీ, కొన్ని సార్లు ఈ చట్టాలే మనం ఏ తప్పు చేయకపోయినా మనల్ని జైలు పాలు చేస్తాయి. అందుకు ఉదాహరణనే ఈ కేసు. వివరాల్లోకి వెళితే..

తైవాన్‌లో ఫాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. తన భార్య మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉందని అనుమానించిన ఆయన, తన ఇంట్లోని బెడ్‌రూమ్, హాల్‌లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. కెమెరాలో భార్య మరొకరితో ఉన్న దృశ్యాలు చూసి ఆయన షాక్‌కు గురయ్యాడు. తర్వాత ఫాన్ చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత తన భార్య నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా ఫాన్ తన భార్యతో ప్రశాంతంగా మాట్లాడి విడాకులు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లి విడాకుల కేసు వేశాడు. మరోవైపు, ఫాన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన సీక్రెట్ కెమెరాలు పెట్టి తన ప్రైవసీని ఉల్లంఘించాడని ఆరోపించింది.

ఫాన్ మాత్రం తన భార్య వల్ల పిల్లలు చాలా బాధపడుతున్నారని, తన భార్య ఎక్కువ సమయం బెడ్‌రూమ్‌లోనే ఉంటుందని, అందుకే కెమెరాలు పెట్టాడని కోర్టుకు చెప్పాడు. కానీ కోర్టు ఫాన్ వివరణను నమ్మలేదు. తన భార్య జీవితాన్ని సీక్రెట్‌గా రికార్డు చేసినందుకు ఫాన్‌కు మూడు నెలలు జైలు శిక్ష విధించింది. కాగా తైవాన్‌లోని చట్టాల ప్రకారం భర్త తన భార్యను సీక్రెట్‌గా రికార్డు చేయడం నేరం. అందుకే అతనికే శిక్ష పడింది. దీంతో ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Similar News