ట్రైన్లో కుర్రాడ్ని బాత్రూమ్లోకి లాక్కెళ్లిన హిజ్రా.. ఎంతసేపు డోర్ తీయకపోవడంతో(వీడియో)
సాధారణంగా రైళ్లలో హిజ్రాలు ప్రయాణికులను మనీ అడుక్కుంటూ తిరుగుతుండటం చూస్తూనే ఉంటాం
దిశ, వెబ్డెస్క్: సాధారణంగా రైళ్లలో హిజ్రాలు ప్రయాణికులను మనీ అడుక్కుంటూ తిరుగుతుండటం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా మగాళ్ల దగ్గరకెళ్లి.. రూ. 10, 20 ఇవ్వాలంటూ ఓ రేంజ్లో డిమాండ్ చేస్తారు. కొంతమంది మగవారు డబ్బులు ఇవ్వకుంటే ప్రయాణికులందరి ముందే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు రైళ్లలో కామన్ అయిపోయాయి. తాజాగా ఓ హిజ్రా ఓ కుర్రాడ్ని బలవంతంగా బాత్రూమ్లోకి లాకెళ్లిన ఘటన జనాలందరికీ నవ్వు తెప్పిస్తుంది.
వివరాల్లోకెళ్తే.. ‘‘ఓ ట్రైన్లో కొంతమంది యువకులు బాత్రూమ్ డోర్ దగ్గర నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి ఓ హిజ్రా చప్పట్లు కొడుతూ వారి దగ్గరకు వచ్చింది. అక్కడున్న కుర్రాళ్లలో ఓ కుర్రాడిని బలవంతంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లింది. వారిద్దరు లోపలికి వెళ్లాక, కొంతమంది యువకులు ఎంతసేపు డోర్ కొట్టినా తీయలేరు. చాలా సేపటి తర్వాత డోర్ తీసి బయటికొచ్చి హిజ్రా వెంటనే వేరే బోగిలోకి వెళ్లిపోయింది. తర్వాత కుర్రాడు బయటికొచ్చి డ్రెస్ సర్డుకుంటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ట్రైన్ లో భద్రతా కరువైందని, కొంతమంది హిజ్రాల ఆగడాలు మితిమీరిపోయాయని ఈ ఘటనపై సీరియస్ అవుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యానికి, పెళ్లిళ్లకు ఆహ్వానించినా.. పది, పదిహేను మంది వస్తూ.. వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంతా డబ్బు ఇవ్వకపోతే నానా హడావిడి చేస్తున్నారు. అంటూ మరికొంతమంది జనాలు హిజ్రాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.