మహిళపై పగబట్టిన పాము.. ఆరేళ్లుగా కాటు వేస్తూనే ఉంది.. చివరికి ఏం చేశారంటే..

మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లా బహోరీబంద్ తహసీల్‌లోని గుణ బచ్చయ్య గ్రామంలో పూజా వ్యాస్ అనే మహిళ ఇంట్లో పని చేసుకుంటుండగా పాము కాటు వేసింది. విషయాన్ని

Update: 2024-05-21 02:17 GMT

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లా బహోరీబంద్ తహసీల్‌లోని గుణ బచ్చయ్య గ్రామంలో పూజా వ్యాస్ అనే మహిళ ఇంట్లో పని చేసుకుంటుండగా పాము కాటు వేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడింది. మే 10న ఈ ఘటన జరిగింది. అయితే పూజకు పాము కాటు వేయడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ఆరేళ్లుగా ఇలాగే జరుగుతుంది. ప్రతీ ఏటా పాము కాటుకు గురవుతునే ఉంది. అదృష్టవశాత్తూ సేఫ్ గా బయటపడుతుంది.

దీంతో ఈ విషయంలో పూజ ఫ్యామిలీ భయపడుతుంది. అసలు పాము తననే ఎందుకు కుడుతుంది? ఏదైనా పగతో వెంటాడుతుందా? ఒకే పాము కాటు వేస్తుందా? అన్న ప్రశ్నలతో సతమతం అవుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా తన గురించి చాలా దిగులుగా ఉంటుందని బాధపడుతున్నారు. ఏం చేస్తే ఈ పాముల పగ నుంచి బయటపడుతామని బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.


Similar News