పవన్ కళ్యాణ్ భార్య సింప్లిసిటీకి జనం ఫిదా.. నాయకురాలి భార్యకు ఉండాల్సిన లక్షణమిదే అంటూ..

ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్పితే ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్

Update: 2024-05-13 06:45 GMT

దిశ, సినిమా : ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్పితే ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. భార్య అన్నా లెజినోవాతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశాడు. ఇదిలా ఉంటే పవన్ భార్యపై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవర్ స్టార్ సతీమణి అయినా ఇంత సింపుల్‌గా ఉండటాన్ని కొనియాడుతున్నారు.

కాగా అన్నా లెజినోవా సింపుల్ కాటన్ శారీలో భర్త పవన్‌తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చింది. చేతులకు రెండు సింగిల్ బ్యాంగిల్స్, మెడలో నల్లపూసల దండతో కనిపించి అందరి మనసు దోచేసింది. జ్యువెల్లరీ జోలికి పోకుండా ఇంత సింప్లిసిటీ మెయింటెన్ చేయడంతో ఫిదా అయిపోయిన జనాలు.. నాయకుడి భార్యకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈమెలో ఉన్నట్లున్నాయని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి లెజినోవా ఈ విధంగా ప్రజలకు చేరువైంది. తమలో ఒకరిగా ఉంటుందని అనిపించుకుంది.


Similar News