ఓర్నీ.. ఇన్ని రోజులు ఎస్కలేటర్‌ ఇలా ఎక్కాలని తెలియక నార్మల్‌గా ఎక్కేశామే.. ఫన్నీ వీడియో వైరల్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2024-08-29 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

బేసిక్‌గా చాలా మందికి ఎస్కలేటర్లు ఎక్కడం రాదు. దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. అలాంటి వారు చాలా వరకు మెట్లనే ఫ్రిఫర్ చేస్తారు. కానీ కొన్ని చోట్ల స్టెప్స్ అనేవి ఉండవు. అక్కడ చచ్చినట్టు ఎస్కలేటర్ ఎక్కాల్సిందే. సేమ్ అలాంటి సిట్యువేషనే ఈ వీడియోలో ఉన్న మహిళలలకు ఎదుర్కొంది. వారి ఇబ్బంది చూస్తే నవ్వకుండా ఉండలేరు.

Ghar Ke Kalesh అనే వీడియో ప్రకారం.. ఇద్దరు మహిళలు ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ వారికి ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చింది. దీంతో వాళ్లు భయపడిపోయారు. అలా భయపడుతునే దానిపై కాలు పెడితే పడిపోతానేమో అని సంకోచిస్తునే ఎలాగోలా ధైర్యం చేసి ఎస్కలేటర్ ఎక్కేసారు. అయితే ఆ ఎస్కలేటర్‌పై వాళ్లు ప్రయాణించిన తీరు చూస్తుంటే మాత్రం నవ్వు తెప్పించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అది చూసిన నెటిజన్లు మా చిన్న తనం గుర్తుకు వస్తుంది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్, కొన్ని వేల లైక్స్ వచ్చాయి.

(video link credits to Ghar Ke Kalesh X account)


Similar News