Occult worship: క్షుద్రపూజల కలకలం..! ఏకంగా పది మంది హిజ్రాలు ఒకేచోట కలిసి..

మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టేంత టెక్నాలజీ వచ్చినా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మూఢ నమ్మకాలను ఇంకా వదలడం లేదు.

Update: 2024-10-04 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టేంత టెక్నాలజీ (Technology) వచ్చినా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మూఢ నమ్మకాలను ఇంకా వదలడం లేదు. నిత్యం ఏదో ఒక గ్రామంలో చేతబడులు చేస్తున్నారంటూ అమాయకులైన వారిని ప్రజలు పొట్టపెట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల ఏకంగా మంత్రాలు చేస్తున్నారనే నెపంతో సజీవ దహనాలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా, మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District)లో క్షుద్రపూజలు (occult worship) కలకలం రేపుతున్నాయి.

బ్రాహ్మణపల్లి (Bramhanapally) గ్రామ శివారు ప్రాంతంలోని ఓ రైతు పొలంలో శుక్రవారం అర్థరాత్రి పది మంది హిజ్రాలు కలిసి క్షుద్ర పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పసుపు, కుంకుమ, కోళ్లను వెంట తెచ్చుకుని పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న గ్రామస్థులు హిజ్రాలు పూజలు చేయడాన్ని గమనించారు. అనంతరం ఊరందరూ ఒక్కటై పొలానికి చేరుకుని హిజ్రాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, పుట్ట మన్ను తీసుకెళ్లి పూజ చేయడం తమ ఆచారమని.. తాము ఎలాంటి క్షుద్ర పూజలు చేయట్లేదని హిజ్రాలు తెలిపారు. మరోవైపు అమావాస్య రోజులు కావడంతోనే వారు క్షుద్రపూజలు చేసేందుకు వచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


Similar News