TGPSC : సిగ్గు.. సిగ్గు.. టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు పోస్టర్ల కలకలం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయం వద్ద పోస్టర్ల కలకలం రేపుతోంది.

Update: 2024-10-04 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయం ముందు పోస్టర్ల కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం కమిషన్ ఆఫీస్ గోడలకు, గేట్లకు వెలసిన పోస్టర్లు వెలిశాయి. గ్రూప్-1 లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు.. సిగ్గు అని పోస్టర్లలో పేర్కొన్నారు. గ్రూప్-1లో 150 ప్రశ్నలు 14 తప్పులు అని, గ్రూప్-3లో 450 ప్రశ్నలు ఎన్ని తప్పుల్లో?, గ్రూప్-2లో 600 ప్రశ్నలు ఇంకెన్ని తప్పుల్లో అని మరో పోస్టర్ వేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ మరోపోస్టర్‌లో పేర్కొన్నారు. టీజీపీఎస్సీ తప్పులు నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు.. టీజీపీఎస్సీ అను నేను ఒక నియంతని నేను తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు.. అని పోస్టర్లు వేశారు. మరోవైపు హైదర్‌గూడలోని తెలుగు అకడమీ ముందు కూడా పోస్టర్లు అంటించారు. నిరుద్యోగులకు గమనిక టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు ప్రమాణికం కానీ తెలుగు అకాడమి పుస్తకాలు కొనకండి, చదవకండి అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు చర్చానీయాంశంగా మారింది. 


Similar News