Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ కు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ కుమార్ కు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది.

Update: 2024-11-28 13:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ (Shravan Kumar) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీర్పును రిజర్వ్ చేసింది. అంతకు ముందు వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రవణ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఓ మీడియా చానల్ కు ఎండీగా ఉన్న శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News