Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ‘పుష్ప’.. షార్ట్ వీడియో చేసిన అల్లు అర్జున్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ కార్యక్రమంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై సినీ పరిశ్రమలు యువతకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ కార్యక్రమంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై సినీ పరిశ్రమలు యువతకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే. టికెట్ రేట్ల పెంపు విషయంలో అనుమతి అంటూ వచ్చే వారికి ఆయన ఓ షరతు పెట్టారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై రెండు నిమిషాల అవగాహన వీడియో చిత్రీకరించాలని సీఎం సూచించారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందన్నారు. దీంతో పలువురు సినీ నటులు తమ సినిమాలు విడుదల అయ్యే ముందు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇవాళ ఎక్స్ వేదికగా అవగాహన కల్పించే షార్ట్ వీడియో విడుదల చేశారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ 1908కి కాల్ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసులకు సీఎంవోకు నార్కోటిక్ బ్యూరోకు ట్యాగ్ చేశారు. కాగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ది రూల్ డిసెంబర్ 5వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే.