Awareness Video: మొబైల్ ఫోన్ లాక్కుందని తల్లి తలపై బ్యాట్‌తో బాదిన కొడుకు (వీడియో)

ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హైపర్ యాక్టీవ్‌గా ఉంటూ ఏ పనినైనా చూసిన వెంటనే ఇట్టే చేసేస్తుంటారు.

Update: 2024-10-04 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హైపర్ యాక్టీవ్‌గా ఉంటూ ఏ పనినైనా చూసిన వెంటనే ఇట్టే చేసేస్తుంటారు. అవి చూసి మనం షాక్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా యాక్టీవ్‌గా ఉంటూ చిన్నతనంలోనే గిన్నిస్ రికార్డ్స్‌లో ఎక్కిన వారు కూడా ఉన్నారు. అయితే మరికొంతమంది పిల్లలేమో మొబైల్స్‌కి బాగా అడిక్ట్ అయ్యి.. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఫోన్లలోనే గడిపేస్తున్నారు. ఆఖరికి అన్నం తినాలన్న మొబైల్‌ చేతిలో పెడితేనే తినే సిట్యూవేషన్‌కి వచ్చేశారు. కాదు, కూడదు అని అన్నామో ఇంకా అంతే సంగతి.. కోపంతో చేతిలో ఉన్న దాన్ని పగలగొట్టడం, ఏడ్వడం, మారాం చేయడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

మేఘ్ అప్డేట్స్ అనే వీడియో ప్రకారం.. ఓ అబ్బాయి మొబైల్‌లో వీడియోలు చూస్తూ గడుపుతున్నాడు. అప్పుడు అతని తల్లి ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఫోన్‌ను లాక్కోని చివాట్లు పెడుతుంది. దీంతో ఆ బాలుడు పుస్తకాన్ని తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తాడు. అలా కొద్దిసేపు తర్వాత పిల్లాడు ఎందుకో లేచి పక్కకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న బ్యాట్‌ను తీసుకుని తల్లి తలపై కొడతాడు. దీంతో ఈ తల్లి క్షణాల వ్యవధిలో సృహ తప్పి కిందపడిపోతుంది. అయితే, అదేమి పట్టించుకోని ఆ పిల్లాడు తన చేతిలో ఉన్న మొబైల్‌ని తీసుకొని మళ్లీ చూడటం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడితో ఈ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు ఈ జనరేషన్ పిల్లలు చాలా డేంజర్ ఉన్నారని, ఆమె సేఫ్‌గానే ఉందా అని, పిల్లలతో జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుత జనరేషన్ కిడ్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఫోన్లకు ఎలా ఎడిక్ట్ అవుతున్నారు అనే దానికిపై కళ్లకు కట్టేందుకు రూపొందించారు. 

(video link credits to megh updates X account)


Similar News