Smart phone effect : ఫోన్ చేతిలో పట్టుకొని చీకటిలో ఆ పని చేస్తున్నారా..? తర్వాత జరిగేది ఇదే!

Health Tips : ఫోన్ చేతిలో పట్టుకొని చీకటిలో ఆ పని చేస్తున్నారా..? తర్వాత జరిగేది ఇదే!

Update: 2024-10-04 07:16 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటోంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఈజీ కావడంతోపాటు పలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూసే అవకాశం అరచేతిలో ఉంటోంది. దీంతో కొందరు రాత్రింబవళ్లు అందులో నిమగ్నమై పోతున్నారు. గంటల తరబడి స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. ఇది హెల్త్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు గదుల్లో లైట్లన్నీ ఆర్పేసిన తర్వాత గంటల తరబడి ఫోన్ చూడటం ప్రమాదకరమని చెప్తున్నారు.

రాత్రి సమయంలో చీకటిలో స్క్రీన్ చూసే అలవాటు మెదడు కణాలను ప్రేరేపిస్తుందని, నరాల బలహీనతకు, నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే చూపు మందగించడం, కళ్లల్లో రెటీనా దెబ్బతినడం వంటివి జరుగుతాయి. కాబట్టి రాత్రిళ్లు చీకటిలో ఫోన్ చూడవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునేకంటే కనీసం ఓ గంట ముందు నుంచే ఫోన్‌ లేదా స్క్రీన్లు చూడటం నిలిపివేయాలని అంటున్నారు. బదులు ఆరుబయట వాకింగ్ చేయడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడటం వంటివి చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు. 

*నోట్:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News