New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం..

సాధారణంగా ప్రతి నెల 1వ తారీకున పలు వస్తువుల ధరలతో పాటు కొన్నింటిలో మార్పులు చేర్పులు చేస్తుంటారు.

Update: 2024-08-30 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి నెల 1వ తారీకున పలు వస్తువుల ధరలతో పాటు కొన్నింటిలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. అలా సెప్టెంబర్ 1 నుంచి కూడా కొన్ని రూల్స్ మారనున్నాయి. మరి ఇంతకీ అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1) ఇతర కార్డుల మాదిరి సెప్టెంబర్ 1 నుంచి రూపే కార్డులకు, వాటితో చేసే UPI లావాదేవీలకూ రివార్డులు తదితర ప్రయోజనాలు అందనున్నాయి.

2) మోసపూరిత కాల్స్, వెబ్ సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన సందేశాలు వినియోగదారులకు పంపించకూడదని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది.

3) ఐడీబీఐ బ్యాంక్‌ (IDBI Bank) డిపాజిట్లను పెంచుకునేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌(FD Scheme) సెప్టెంబరు 30తో ముగియనుంది. 444 రోజుల పాటు చేసే ఎఫ్‌డీ డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీని, సీనియర్‌ సిటిజన్లకు అత్యధికంగా 7.85 వడ్డీని బ్యాంకు అందిస్తోంది.

4) ఆధార్ వివరాల్లో ఉచితంగా మార్పులుచేర్పులు చేసుకునేందుకు అప్‌డేట్‌ యునీక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) పొడిగించిన గడువు 2024 సెప్టెంబర్‌ 14న ముగియనుంది. గడువు సమీపిస్తుండటంతో ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిస్తే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాలి.

5) HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై నెలకు 2,000 పాయింట్లు మాత్రమే పొందగలరు.

6) ప్రతి నెలలాగే సిలిండర్ ధర సెప్టెంబర్ 1 నే మారే అవకాశం ఉంది. ఇంట్లో వాడే సిలిండర్ల ధరల్లో మార్పు ఉండక పోయినప్పటికీ.. వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పు ఉండవచ్చు. ఏటీఎఫ్‌, సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలూ మారే అవకాశం ఉంది.


Similar News