Viral news: ట్రోల్స్ ఎఫెక్ట్.. మౌళి క్షమాపణలు
ఏడిపించడం సులభం.. నవ్వించడమే కష్టం.
దిశ డైనమిక్ బ్యూరో: ఏడిపించడం సులభం.. నవ్వించడమే కష్టం. అందుకే అన్ని కళల్లోకి కష్టమైన కళ హాస్యం అంటారు. కామెడీ చేసేవాళ్లు ఆచితూచి మాట్లాడాలి లేకపోతే మొదటికే మోసం వస్తుంది. హాస్యం పేరుతో ఏది పడితే అది మాట్లాడితే ఆ హాస్యం కాస్త అపహాస్యమై మనల్నే నవ్వులు పాలు చేస్తోంది అనడానికి 90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌలి నిదర్శనం. 90s వెబ్ సిరీస్ తో గుర్తింపు సంపాదించుకున్న మౌలి ఇటీవల ఓ కాంట్రవర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఓ స్టేజ్ మీద కామెడీ చేస్తూ.. అరచేతిని మూసి పెట్టాడు.. ఆ తరువాత కాసేపటికి ఆ అరచేతిని తీసి.. ఇందులోంచి ఒక దాన్ని మాయం చేశాను అదేంటో తెలుసా? ఏపీ క్యాపిటల్.. వెళ్లి చూసుకోండి.. ఎక్కడా కనిపించదు అంటూ హాస్యం పండించాలి అనుకున్నారు. అయితే సీన్ రెవెర్స్ అయ్యి ట్రోల్లర్స్ దృష్టిలో పడ్డారు. ఆకలితో ఉన్న పులికి ఆహరం దొరికినట్లు ట్రోల్లర్స్ మౌళిని ట్రోల్ల్స్ లో ముంచెత్తారు.
దీనితో తనపై ప్రజల్లో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని గ్రహించిన మౌలి X వేదికగా స్పందించారు. తాను ఎల్లపుడూ మంచి కామెడీని అందించాలని ప్రయత్నిస్తానని.. అయితే తాజాగా తాను కామెడీ చేస్తూ చెప్పిన ఓ జోక్ సోషల్ మీడియాలో తనపై ప్రతికూల స్పందన తెస్తోందని.. తాను కేవలం నవ్వించడానికి ఆలా చేసానని.. ఉద్దేశపూర్వకంగా చెయ్యలేదని.. తనవల్ల ఎవరైనా బాధపడి ఉన్న.. అలానే తన వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటె క్షమించాలని.. తన తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దని X లో పోస్ట్ చేశారు.