Viral video: వర్షంలో తడుస్తున్న పిల్లి పిల్ల.. పెంపుడు కుక్క వెళ్లి ఏం చేసిందో చూడండి!

సాధారణంగా కుక్క-పిల్లి మధ్య జాతి వైరం సృష్టి ధర్మం అని మనందరికి తెలిసిందే.

Update: 2025-03-25 07:29 GMT
Viral video: వర్షంలో తడుస్తున్న పిల్లి పిల్ల.. పెంపుడు కుక్క వెళ్లి ఏం చేసిందో చూడండి!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కుక్క-పిల్లి (Dog-Cat) మధ్య జాతి వైరం సృష్టి ధర్మం అని మనందరికి తెలిసిందే. అందుకే ఒకదానికొకటి ఎదురుపడవు. పొరపాటున ఎదురుపడిన ఇక అంతే సంగతులు. కుక్కకు పిల్లి కనిపించిందంటే చాలు వెంటపడి వెంటపడి తరిమికొడుతుంది. అలాగే కుక్క కనపడగానే పిల్లి అల్లంత దూరం పారిపోతుంది. కానీ, ఇటీవల కాలంలో జాతివైరాన్ని మరిచి ఆ రెండు జంతువులు అన్యోన్నంగా కలిసి ఉంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో (Social Media) తరచూ మనం చూస్తున్నాం. తాజాగా నెట్టింట ఈ తరహా ఓ వీడియో వైరల్‌గా (Viral video) మారింది.

వర్షంలో వీధి పిల్లి పిల్ల తడటవం గమనించిన ఓ పెంపుడు కుక్క.. చలించిపోయింది. దాని దగ్గరకి వెళ్లి తనతో రమ్మనింది. దీంతో పిల్లి పిల్ల కుక్కను ఫాలో అయింది. వెనుకే వస్తుందా? లేదా? అని గమనిస్తూ కుక్క పిల్లికి దారి చూపిస్తుంది. ఇంటి గుమ్మం దగ్గర మెట్లు ఎక్కెందుకు ఇబ్బంది పడుతుంటే సాయం చేసి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. జాతి వైరాన్ని మరచి ఆపదలో ఉన్న పిల్లికి కుక్క హెల్పింగ్‌ గ్రేట్ అంటూ, ఇలాంటి వీడియోలను చూసైనా మనిషి బుద్ధి తెచ్చుకోవాలని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News