Vote: ఓటుకు పది మార్కులు.. ఆ కాలేజ్ బంపర్ ఆఫర్.. ఆలస్యంగా వెలుగులోకి

లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ (Polling) మే 20న జరగనుంది. ఈ క్రమంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన సెయింట్ జోసెఫ్ కాలేజ్

Update: 2024-05-19 02:01 GMT

దిశ, ఫీచర్స్: లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ (Polling) మే 20న జరగనుంది. ఈ క్రమంలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన సెయింట్ జోసెఫ్ కాలేజ్ వినూత్న ప్రయత్నంతో ముందుకు వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఓటు వేస్తే అదనంగా పది మార్కులు యాడ్ చేస్తామని ప్రకటించింది. ఓటు వేసాక తర్వాతి రోజు వచ్చి సిరా మరక చూపిస్తే మార్కులు యాడ్ చేస్తామని చెప్పారు. పేరెంట్స్ ఇద్దరూ ఓటు హక్కు వినియోగించుకుంటే 20 మార్కులు అని స్పష్టం చేసింది. ఇక ఈ మార్క్స్ ఒక్క సబ్జెక్ట్ లేదా తమకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ కు నచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చని యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఓటు వేసిన స్టాఫ్ కు సెలవుతోపాటు ఒక్కరోజు శాలరీ ఇస్తున్నట్లు తెలిపింది.

ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా నెటిజన్ల రియాక్షన్ అదిరిపోయింది. మా దగ్గర కూడా ఇలాంటి ఆఫర్ ఇచ్చి ఉంటే కచ్చితంగా పాస్ అయ్యేవాళ్ళం అంటున్నారు. కనీసం తాము అక్కడ చదివినా బాగుండేది కదా అని ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే రోజు ముంబైలో పోలింగ్ జరగనుండగా.. మాజీ కార్పొరేటర్ మకరంద్ నార్వేకర్ యూనిక్ థాట్ తో ముందుకు వచ్చాడు. ట్రావెలింగ్ ప్లాన్స్ మానుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు. పోలింగ్ పెంచేందుకు ట్రావెల్ ఏజెంట్లు, కంపెనీలు ఎలాంటి క్యాన్సలేషన్ ఫీజు తీసుకోకూడదని విజ్ఞప్తి చేశాడు. ఈ ట్రిప్ కు తర్వాత వెళ్ళినప్పుడు డిస్కౌంట్ కూడా ఇవ్వాలని కోరాడు


Similar News