కుమారి ఆంటీ మెడలో బహుబలి నగ.. వామ్మో అన్ని తులాలా..?

సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-04-06 10:21 GMT

Kumari aunty who bought 2 lakh jewelry

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అక్కర్లేదు. గుడివాడ నుంచి హైదరాబాదు నగరానికి వచ్చి ఇక్కడ రోడ్డు సైడ్ ఫుడ్ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుందీ ఆంటీ. కుమారి ఆంటీ ఫుడ్ వీడియోలు వైరలైనప్పటి నుంచి జూబ్లీహిల్స్‌‌లోని ఆమె ఫుడ్ సెంటర్‌కు ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈమె ఇంటర్వ్యూల కోసం పలు యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఎగబడుతున్నాయి. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడంతో కుమారి ఆంటీ క్రేజ్ మరింత పెరిగింది. పలువురు సెలబ్రిటీలు కూడా వచ్చి కుమారి ఆంటీ ఫుడ్‌ను ఆస్వాదించారు. అయితే ఈ ఆంటీ తాజాగా కల్యాణి జ్యువెల్లర్‌లో అరుంధతి అనుష్క మాదిరి భారీ బంగారు నక్లెస్ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల డబ్బు పొదుపు చేసుకుని ఈ కొన్నానని తెలిపింది. ఒక్కసారే బంగారం కొనడమంటే కష్టమవుతుంది కదా’ అని చెప్పుకొచ్చింది. అయితే ఆ నగను చూసిన నెటిజన్లు వామ్మో.. కుమారి ఆంటీ బాహుబలిలాంటి భారీ నక్లెస్‌ను కొన్నది.. ఎన్ని తులాలో.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Full View

Similar News