ఇది కదా ఇండియా: కుమారుడిని కృష్ణుడిలాగా అలంకరించిన ముస్లిం దంపతులు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

రీసెంట్‌గా శ్రీకృష్ణా జన్మాష్టమి ఉత్సవాలు భారత దేశ మంతటా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-08-28 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా శ్రీకృష్ణా జన్మాష్టమి ఉత్సవాలు భారత దేశ మంతటా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే బేసిక్‌గా ఆ రోజు హిందూ పేరేంట్స్ అందరూ తమ పిల్లలకు రాధా, కృష్ణ వేషధారణ వేయడం మనం చూస్తుంటాం. అమ్మాయిలను రాధగా, అబ్బాయిలను కృష్ణునిగా అలరించి వారిలో ఆ దేవతలను దూసుకొని మురిసిపోతారు. అయితే ఈ పండుగకు సాధారణంగా ముస్లిం ప్రజలు దూరంగా ఉంటారు. కానీ రీసెంట్‌గా జరిగిన వేడుకల్లో మాత్రం ఓ ముస్లిం దంపతులు తమ కుమారునికి కృష్ణుడు వేషధారణ వేసి పాఠశాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో ఈ హార్ట్ టచింగ్ సీన్ కనిపించింది. వైరల్ వీడియోలో ఒక ముస్లిం కుటుంబం తన చిన్నారిని కృష్ణుడిగా వేషధారణ చేసి జన్మాష్టమి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ కుటుంబం తమ బిడ్డను కృష్ణుడి వేషంలో వేసుకొని, బైక్‌పై ఇంటి నుంచి బయలు దేరారు. అంతే కాకుండా ఆ వీడియోకు ఒక ముస్లిం కుటుంబం తమ బిడ్డను క‌ష్ణుడిగా వేషధారణ చేసింది అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఇది కదా అసలైన భారత్ అంటూ ఈ ఫ్యామిలీని తెగ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to punjablocals instagram id)


Similar News