WHI : సంతోషకరమైన దేశాల్లో భారత్ స్థానం..! పాకిస్థాన్ కంటే దారుణం

వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్-2024(World Happiness Index-2024) ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది డబ్ల్యూహెచ్ఐ(WHI).

Update: 2025-01-22 17:42 GMT
WHI : సంతోషకరమైన దేశాల్లో భారత్ స్థానం..! పాకిస్థాన్ కంటే దారుణం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్-2024(World Happiness Index-2024) ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది డబ్ల్యూహెచ్ఐ(WHI). ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో అంత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో మొట్ట మొదటి స్థానంలో ఫిన్లాండ్(Finland) నిలిచింది. మొత్తం 140 దేశాల జాబితాలో.. ఫిన్లాండ్ ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ తరువాతి స్థానాల్లో డెన్మార్క్(Denmark), ఐస్ లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు టాప్ 10 లో నిలిచాయి. అయితే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో భారత్(Bharath) మాత్రం టాప్ 100 లో కూడా లేకపోవడం విచారకరం అంటున్నారు నిపుణులు. ఈ జాబితాలో మనదేశం 126 వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాది భారత్ 125వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది మరో స్థానం కిందకి దిగజారడం గమనార్హం. అయితే మన దాయాది పాకిస్థాన్ మాత్రం 108 స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. 

Tags:    

Similar News