GREAT FATHER: ఇదే కదా ఫాదర్ లవ్.. చిన్నారి రక్షణ కోసం కంగారోలా మారిన తండ్రి

సాధారణంగా అమ్మాయిలు నాన్న మీద ఎక్కువగా ప్రేమను పెంచుకుంటారు.

Update: 2024-08-26 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అమ్మాయిలు నాన్న మీద ఎక్కువగా ప్రేమను పెంచుకుంటారు. కని పెంచినది తల్లే అయినప్పటికీ వారికి తమ ఫాదర్ అంటేనే ఎనలేని ప్రేమ. నాన్నను ఎవ్వరైన ఒక్క మాట అంటే చాలు వారిమీదకు కయ్యానికి కాలు దువ్వుతారు. అలాగే నాన్న కూడా ఈ విషయంలో ఏమి తక్కువ కాదు. అప్పటి వరకు తనను నమ్మి వచ్చిన భార్య మీద ఉన్న ప్రేమ.. పాపాయి పుట్టాక తన ప్రేమ మొత్తాన్ని ఆ చిన్నారికే వలకపోస్తాడు. పుట్టినప్పటి నుంచి అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. తనకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఉన్నాను తల్లి.. అంటూ కష్టం కంటే ముందే ఉంటాడు. కుటుంబాన్ని పోషించడం కోసం ఉదయం అన్నాక వెళ్లి రాత్రికి కాని రారు. అప్పటి వరకు పడిన కష్టాన్ని తన కూతుర్ని చూసి క్షణంలో అన్నీ మర్చిపోతాడు. ఇదే కదా నిజమైన ప్రేమ.. ప్రస్తుతం ఆ కోవకు చెందిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బేసిక్‌గా వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. వర్షంతో పాటు చలి కూడా ఉంటుంది. మరి ఈ ఫొటోలో ఉన్న తండ్రి అర్జెంట్‌గా ఎక్కడికే వెళ్లాల్సిన పని పడిందేమో కానీ, తన పాపాయికి చలి తగలకూడదు అని చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో భాగంగా చిన్నారికి ఎక్కడ చల్లగాలి తగిలిద్దో అని భయంతో కంగారో తన పిల్లల రక్షణ కోసం తన యద సంచిలో ఎలా దాచి పెట్టి కాపాడుకుంటుందో.. ఈ తండ్రి కూడా తన బిడ్డను చలి గాలుల నుంచి రక్షించడానికి తను వేసుకున్న స్వెటర్ లోనే చిన్నారిని ఉంచి కాపాడుకోవడం చూస్తే తండ్రి హృదయం, ప్రేమ ఎలాంటిదో తెలుస్తోంది. అయితే ఆ పాపాయి కూడా.. తన తండ్రి వెచ్చదనంలో బోసి నవ్వులతో క్యూట్‌గా చూస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు ఇదే కదా ఫాదర్ లవ్.. వావ్ గ్రేట్ ఫాదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ పిక్స్‌ను చూసేయండి.





 


Similar News