Big Breaking.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన 'X' సేవలు.. ‘ట్విట్టర్ డౌన్’ అనే హాష్ ట్యాగ్‌తో విమర్శలు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Update: 2024-08-28 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. అమెరికాలో దాదాపు 27,000 మంది తాము పోస్ట్ చేస్తుంటే X లో పోస్ట్ అవ్వడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం, X మంగళవారం సాయంత్రం నుంచి సేవలకు అంతరాయాలను ఎదుర్కొంది. డౌన్‌డెటెక్టర్, వినియోగదారులతో సహా అనేక మూలాల నుండి స్టేటస్ రిపోర్ట్‌ల ద్వారా అంతరాయాలను ట్రాక్ చేశామని.. అమెరికాలో 27,700 కంటే ఎక్కువ మందికి అంతరాయ ఏర్పడినట్లు తెలుస్తోందని పేర్కొంది. కాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసుకున్న తర్వాత ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ వస్తున్నాయి. అయితే, ఈ సాంకేతిక లోపాలకు మాత్రం మస్క్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఇదే నెలలో ట్విట్టర్ డౌన్ కావడం ఇది రెండోసారి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అందులో భాగంగా ప్రస్తుతం ట్విట్టర్‌లో "ట్విట్టర్ డౌన్" అనే హాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. అందులో కొన్ని దేశాల్లో తమకు ట్విట్టర్ పనిచేస్తోందని, మేము పోస్ట్ చేయగలుగుతున్నామని నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ట్విట్టర్‌లో మేము పోస్ట్ చేయలేకపోతున్నామని విమర్శలు గుప్పిస్తున్నారు. మరి మీ దగ్గర ట్విట్టర్ పనిచేస్తుందో లేదో కామెంట్ చేసేయండి.

(video link credits to chloe, Randhir X accounts)


Similar News