భారీ షాక్.. పెళ్లైన వారం రోజులకే ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బర్రెలక్క
హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు, పీజీలు చదివినా పట్టాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు
దిశ, వెబ్‌డెస్క్: ‘‘హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు, పీజీలు చదివినా పట్టాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు’’ అంటూ 2021 నవంబరు 5న సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి ఫుల్ ఫేమస్ అయ్యింది కర్నె శిరీష (బర్రెలక్క). గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బర్రెలక్క మరింత గుర్తింపు పొందింది. ఈ ఎన్నికల్లో బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈమెకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో అండగా నిలిచారు. గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని నెట్టింట జనాలు పాజిటివ్ కామెంట్స్ చేశారు. బర్రెలక్క ఓటమి చవిచూసినప్పటికీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఇటీవలే వెంకటేష్ అనే అబ్బాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే బర్రెలక్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ వీడియో పంచుకుంది.. ‘‘ఒక అమ్మాయికి గాయం అయితే.. గాయం చేసిన వాళ్లని ఏమీ అనరు కానీ, గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు. మంచోళ్లు ఉన్నారు.. చెడ్డోళ్లు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలని ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్లు బయట బాగానే ఉన్నారు. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు’’ అంటూ ఈ వీడియోలో ఉంది. ఈ స్టోరీ వీక్షించిన నెటిజన్లు.. పెళ్లై వారం కాలే ఏమైందంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.