Viral : పురుషాంగంపై ఆహారం రుద్ది.. దానిపై యూరిన్ చేసి.. ఆ తర్వాత కస్టమర్లకు సర్వ్ చేశాడు..

US కాన్సాస్ లోని ఓ రెస్టారెంట్ సర్వర్ దారుణమైన పని చేశాడు. కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేసే ముందు ఆ ఆహారాన్ని తన పురుషాంగ

Update: 2024-05-16 08:57 GMT

దిశ, ఫీచర్స్: US కాన్సాస్ లోని ఓ రెస్టారెంట్ సర్వర్ దారుణమైన పని చేశాడు. కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేసే ముందు ఆ ఆహారాన్ని తన పురుషాంగంపై ఉంచడం, యూరిన్ చేయడం, ప్యాంట్ ఓపెన్ చేసి వాటిపై కూర్చోవడం, తొక్కడం వంటివి చేశాడు. ఈ వాంతులు తెప్పించే వీడియోలను సోషల్ మీడియాలో, ఓ వెబ్ సైట్ లో అపరిచిత వ్యక్తి అప్ లోడ్ చేయడంతో దొరికిపోయాడు. ఇలా ఆహారాన్ని కలుషితం చేసి.. వారి అనారోగ్యానికి కారణమయ్యే పని చేసినందుకు శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

జేస్ క్రిస్టియన్ హాన్సన్ పాపులర్ రెస్టారెంట్ హియర్ ఫోర్డ్ హౌజ్ స్టెక్ హౌజ్ లో పని చేస్తున్నాడు. అయితే అతనికి డేటింగ్ యాప్ లో ఓ వ్యక్తి కలవడం.. క్లోజ్ అయిపోవడం.. మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఫుడ్ సర్వ్ చేసేముందు ఇలాంటి పిచ్చి పనులు చేయాలని ఆదేశించాడు. వాటిని వీడియో తీయాలని, తనకు సెండ్ చేయాలని కోరాడు. అలాగే చేయడంతో.. వాటిని నెట్టింట అప్ లోడ్ చేశాడు. అయితే ఈ వీడియోలు ఆ రెస్టారెంట్

ఓనర్ చూసి.. తన వర్కర్ హాన్సన్ ఇదంతా చేస్తున్నాడని గుర్తించాడు. ఆ వీడియోలలో కనిపిస్తున్న పాత్రలు, సాస్, ఆ రోజు హాన్సన్ వేసుకున్న షూ సేమ్ కావడంతో డౌట్ వచ్చి పోలిసులకు సమాచారం ఇచ్చాడు. కాగా నిందితుడు తన డేటింగ్ యాప్ ఫ్రెండ్ చెప్పినట్లే తను చేశానని పోలీసులకు తెలిపాడు. ఇలా 20సార్లు జరిగిందని... తప్పు చేశానని ఒప్పుకున్నాడు. కాగా దీనిపై విచారణ జరుగుతుండగా.. ఎన్నేళ్లు శిక్ష పడుతుందో త్వరలో కోర్టు తీర్పు ఇవ్వనుంది.


Similar News