షాకింగ్ ఘటన.. స్లో మోషన్లో రీల్ చేస్తూ నాలుగో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో పడ్డ యువకుడు(Video Viral)
ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్స్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎలాగైనా సరే సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో యువత ప్రమాదకర ప్రదేశాలలో రీల్స్ చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్స్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎలాగైనా సరే సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో యువత ప్రమాదకర ప్రదేశాలలో రీల్స్ చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. కొంతమంది కదులుతున్న ట్రైన్‌కు అడ్డంగా నిలబడి వీడియోలు తీయడం, మరికొందరు ప్రాణాంతక బైక్ స్టంట్లు చేస్తున్నారు. ఈ రీల్స్ మోజులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఇటీవల ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ఆగ్రాకు చెందిన ఓ యువకుడు రీల్ మోజులో పడి దారుణంగా చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుత కాలంలో ఎక్కడపడితే అక్కడ రీల్స్, షార్ట్స్ తీస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అగ్రాలో ఆసిఫ్(20) అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి స్లో మోషన్లో రీల్స్ చేస్తూ నాలుగో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. బిల్డింగ్ మధ్యలో సేఫ్టీ రెయిలింగ్‌ను తీసేసి పొరపాటున అడుగుపెట్టగానే అతను గ్రౌండ్ ఫ్లోర్లో పడటంతో తల, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది.
REEL में चली गई जान...
— Shyam Dwivedi (@shyamjilive) October 19, 2024
आगरा में रील बना रहे युवक की गर्दन कटी:तीसरी मंजिल पर डांस का कर रहा था स्टेप, जाल से सिर हुआ धड़ से अलग#UttarPradsh @agrapolice https://t.co/lF81zzEkdh pic.twitter.com/kausk0VTvI