Viral : టాక్సీల్లో కూడా శృంగారం చేస్తున్నారా? క్యాబ్ సీటు వెనుక ‘నో రొమాన్స్’ వార్నింగ్ ఫోటో వైరల్

కొంత మంది ప్రేమ జంటలు బైక్‌లపై, పబ్లిక్ ప్లేసులు, పార్కులు ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేస్తున్న వైరల్ వీడియోలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

Update: 2024-10-20 11:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది ప్రేమ జంటలు బైక్‌లపై, పబ్లిక్ ప్లేసులు, పార్కులు ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేస్తున్న వైరల్ వీడియోలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రియుడు బైక్ నడుపుతుంటే.. ప్రియురాలు అతని వెనుక కూర్చొని గట్టిగా హత్తుకోవడం చూసే ఉంటారు. హైదరాబాద్‌లో కూడా అలా రోజూ కొన్ని వేల ప్రేమ జంటలు తిరుగుతున్నాయి. అయితే, ఈ మధ్య టాక్సీల్లో కూడా కొన్ని ప్రేమజంట చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతోంది. హాయ్ హైదరాబాద్ అనే ఓ హ్యాండిల్ ఎక్స్ వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

కారులో క్యాబ్ డ్రైవర్ సీటు వెనుక ‘వార్నింగ్.. నో రొమాన్స్, ఈ కారులో రొమాన్స్ చేయకండి, ఇది మీ ప్రైవేట్ ప్లేస్ లేక ఓయో రూమ్ కాదు.. కాబట్టి ప్లీజ్ కీప్ డిస్టెన్స్ అండ్ స్టే కామ్’ అంటూ లామినేషన్ పేపర్ బోర్డు సీటుకు తగిలించి ఉంది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్‌లో కూడా శృంగారం చేస్తున్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఎన్ని చూశాడో.. భరించలేక ఇలా వార్నింగ్ ఇచ్చాడని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనుక సీట్‌లో రొమాన్స్ చూసి డ్రైవర్ ఫీల్ అయినట్టుందని అందుకే ఇలా బోర్డు పెట్టుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ, బెంగళూరే అనుకున్న హైదరాబాద్‌లో కూడా ఇలాంటి వార్నింగ్‌లు తాను ఊహించలేదని? అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.


Similar News