కాంగ్రెస్ అసమర్థ పాలన మరో పేద బిడ్డ ప్రాణం తీసింది: ఎమ్మెల్సీ కవిత
ఈ నెల 3న వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (Vankidi Ashram School) కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 3న వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (Vankidi Ashram School) కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో విద్యార్థిని శైలజ(16) పరిస్థితి విషమంగా మారడంతో.. హైదరాబాద్‌లోని నిమ్స్(NIMS) ఆస్పత్రిలో చికిత్స అందింస్తూ వస్తున్నారు. కానీ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో 22 రోజులుగా ఆస్పత్రి బెడ్ పైన ఉన్న శైలజ(Shailaja) ఈ రోజు సాయంత్రం మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఫుడ్ పాయిజన్ కారణంగా బాలిక మృతి చెందడం పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. వాంకిడి విద్యార్థిని శైలజ మరణం తనను కలచి వేసిందన్నారు. అలాగే కాంగ్రెస్ అసమర్థ పాలన(Congress inefficient governance) మరో పేద బిడ్డ ప్రాణం తీసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. 11 నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిందని.. ఇవన్నీ రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యలే అంటూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.