MallaReddy : పొలిటికల్ టిల్లు.. మాజీమంత్రి మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

తన మనవరాలి సంగీత్ ఫంక్షన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Update: 2024-10-21 07:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తన మనవరాలి సంగీత్ ఫంక్షన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ రాజకీయ, వ్యాపార వేత్తగా పేరు పొందిన మల్లారెడ్డి ఎల్లప్పుడూ తన మాస్ డైలాగులతో నెట్టింట వైరల్ గా మారుతుంటారు. ఈ సారి ఏకంగా సినిమా స్టైల్లో స్టెప్పులు వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 27 న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య సంగీత్ ఫంక్షన్ నిర్వహించుకున్నారు.

ఆ ఈవెంట్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. మంచి కాస్ట్యూమ్ ధరించి మనవళ్లు, కొరియోగ్రాఫర్ల నడుమ డ్యాన్స్ ఇరగదీశారు. ఏడు పదుల వయస్సులో కుర్రకారుకు ఏ మాత్రం తీసిపోకుండా మాస్ స్టైల్లో నృత్యం చేశారు. గతంలో పలు ఈవెంట్లలో డ్యాన్స్ వేసినా ఈ సారి సినిమాను తలపించేలా డ్యాన్స్ వేశారు. దీనికోసం కోరియోగ్రాఫర్లతో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో మరోసారి మల్లారెడ్డి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.


Similar News