కండోమ్ కేఫ్: ఇక్కడన్నీ కండోమ్‌లతోనే..?! (వీడియో)
సీరియస్ సందేశాన్ని తేలికగా ప్రచారం చేస్తోంది. Popularly known as Condom Café has made with plenty of condoms
దిశ, వెబ్‌డెస్క్ః విచిత్రమైన కాన్సెప్ట్‌లతో వింతైన చోట్లు చాలా ఉంటాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి ఐడియాలను అభివృద్ధిచేస్తుంటారు. అలాంటి క్రియేటీవ్ ప్రాంతాల్లో థాయిలాండ్ ఒకటి. బ్యాచిలర్స్ ప్యారడైజ్‌గా పాపులర్ అయిన ఈ దేశంలో కండోమ్ కేఫ్ అనేది ఒకటుందని చాలా మందికి తెలియకపోవచ్చు. థాయిలాండ్‌లోని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ప్రదేశాల్లో ఇదీ ఒకటి. ప్రపంచంలోని అతిపెద్ద సమస్యలలో ఒకటైన అధిక జనాభాను నియంత్రించే కండోమ్‌లతో అసాధారణంగా ఈ కేఫ్‌ను డిజైన్ చేశారు. డిజిటల్ కంటెంట్ సృష్టికర్త మొహ్నిష్ దౌల్తానీ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన ఈ కేఫ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
బ్యాంకాక్‌లో ఉన్న ఈ కేఫ్ పేరు 'కాఫీ అండ్ కండోమ్స్' ఇందులోని విగ్రహాలు, పువ్వులు, శాంతా క్లాజ్ గడ్డం, దీపాలు, దుస్తులు.. ఒకటేంటి, ఏది పట్టుకున్నా కండోమే! ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్ వెనుక ఉన్న కారణాన్ని వివరించిన మోహ్నిష్, 'జనాభా నియంత్రణ కోసం కండోమ్‌లు కూడా మార్కెట్లో కూరగాయలు కొనగలిగేంత సులభంగా అందుబాటులో ఉండాలని' క్యాప్షన్ జోడించాడు. ఇక, సెక్స్, కుటుంబ నియంత్రణ, సుఖవ్యాధుల వంటి సమస్యలను చర్చించడానికి, వ్యక్తుల్లో అజ్ఞానాన్ని, అపోహలను తొలగించడానికి ఈ కేఫ్ జోకులు, ఆధారాలు, వివిధ దృశ్యాలను ఉపయోగిస్తుంది. ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించే సీరియస్ సందేశాన్ని తేలికగా ప్రచారం చేస్తోంది ఈ కండోమ్స్ కేఫ్!