63 ఏళ్ల వ్యక్తితో 12 ఏళ్ల బాలిక పెళ్లి.. 6 ఏళ్లకే అలా చేయడంతో నోరెళ్లబెడుతోన్న జనాలు..!!

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ఇందుకోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుపుతున్నారు.

Update: 2024-04-05 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ఇందుకోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుపుతున్నారు. బాల్య వివాహాలతో ఆడపిల్లలు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండాలి. అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండితేనే కోర్టు వివాహానికి అనుమతిచ్చింది. కనీస వయస్సులోనే పెళ్లి చేసుకోవాలనే నిబంధనలు కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అమల్లోకి వచ్చాయి. బాల్య వివాహాలు చేయొద్దని అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. కలెక్టర్లు అవగాహన ప్రసంగాలు ఇచ్చినా.. ఇప్పటికి కొంతమంది బాల్య వివాహాలు జరిపిస్తూనే ఉన్నారు. అయితే పూర్తి వివరాలు తెలియనప్పటికీ రీసెంట్ గా 63 ఏళ్ల ఓ పూజారి 12 సంవత్సరాల అభం శుభం తెలియని ఓ బాలికను వివాహం చేసుకున్నాడు. అయితే ఆ బాలిక 6 సంవత్సరాల వయసున్నప్పుడే పూజారి ఆమెను భార్యగా ఎంపిక చేసుకున్నాడట. ఈ వార్త విన్న నెటిజన్లు పూజారిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News