బెల్లంపల్లిలో ఈదురుగాలుల బీభత్సం

దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలంలో అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలులకు వడగండ్ల వాన తోడవ్వడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉదయం నుంచి తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఉపశమనం లభించింది. వడగండ్ల వానతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Update: 2020-05-25 08:24 GMT

Tags:    

Similar News