అప్పటివరకూ రైలు సేవలపై నిషేధం..
న్యూఢిల్లీ: రైలు సేవలపై ఇదివరకు ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలాఖరు వరకూ పొడిగించింది. ప్యాసింజర్ ట్రైన్లు, మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, సబర్బన్ రైళ్ల సేవల నిలుపుదలను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ భారత రైల్వే శాఖ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే, స్పెషల్ ట్రైన్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రత్యేక రైళ్లు ప్రస్తుతం అమలు చేస్తున్న షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని వివరించింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే సేవలపై […]
న్యూఢిల్లీ: రైలు సేవలపై ఇదివరకు ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలాఖరు వరకూ పొడిగించింది. ప్యాసింజర్ ట్రైన్లు, మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, సబర్బన్ రైళ్ల సేవల నిలుపుదలను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ భారత రైల్వే శాఖ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
అయితే, స్పెషల్ ట్రైన్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రత్యేక రైళ్లు ప్రస్తుతం అమలు చేస్తున్న షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని వివరించింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతంలో విధించిన బ్యాన్ ఈ నెల 12వ తేదీతో ముగుస్తున్నందున తాజా ఉత్వర్వుల్లో నిషేధాన్ని వచ్చే నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.