మాకు దారేది.. ! అక్కడ నిలిచిపోయిన అంతర్రాష్ట్ర రాకపోకలు

దిశ, వాజేడు : తెలంగాణ ఛత్తీస్‌ఘర్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా పెరగడంతో మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం వద్ద 163 జాతీయ రహదారి నీట మునిగింది. దీనితో అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం కలిగి రవాణా సౌకర్యం స్తంభించి, రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పూర్తిగా మునిగిపోవడంతో అటువైపు వెళ్తున్న వాహనాలను వాజేడు తహసీల్దార్ రాజ్ కుమార్ అనుమతించడం లేదు, స్టాప్ బోర్డులు ఏర్పాటు చేసి వాహనాలను నిలుపుదల […]

Update: 2021-09-08 02:00 GMT

దిశ, వాజేడు : తెలంగాణ ఛత్తీస్‌ఘర్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా పెరగడంతో మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం వద్ద 163 జాతీయ రహదారి నీట మునిగింది. దీనితో అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం కలిగి రవాణా సౌకర్యం స్తంభించి, రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పూర్తిగా మునిగిపోవడంతో అటువైపు వెళ్తున్న వాహనాలను వాజేడు తహసీల్దార్ రాజ్ కుమార్ అనుమతించడం లేదు, స్టాప్ బోర్డులు ఏర్పాటు చేసి వాహనాలను నిలుపుదల చేశారు.

గోదావరి ఒకవైపు ఉధృతంగా పెరుగుతూ వాజేడు మండలం పేరూరు వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు 12.340 మీటర్లకు చేరుకుంది. దీనితో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు. దీనితో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి ముంపు కారణంగా పలుచోట్ల మిర్చి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాలను వాజేడు తహసీల్దార్ రాజ్ కుమార్ అనుక్షణం పరిశీలిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

Tags:    

Similar News