Kolkata: కోల్‌కతా అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులను కలవనున్న అమిత్ షా

బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి సంప్రదించిన తర్వాత అందుకు అమిత్ షా సుముఖతం వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి

Update: 2024-10-24 18:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యచార, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవనున్నారు. బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి సంప్రదించిన తర్వాత అందుకు అమిత్ షా సుముఖతం వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నేపథ్యంలో హోంమంత్రి కోల్‌కతాకు రావాల్సి ఉంది. అయితే, ఆయన పర్యటన వాయిదా పడింది. లేకుంటే గురువారమే బాధితురాలి తల్లిదండ్రులతో సమావేశం జరిగేది. ఆదివారం(అక్టోబర్ 27న) పర్యటన ఉండవచ్చని, ఆరోజే వారితో సమావేశం జరిగే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారు. తమ కూతురికి జరిగిన దానికి తాము తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని, నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఇటీవల బాధితురాలి తండ్రి హోంమంత్రికి లేఖ రాశారు. హోంమంత్రిని కలవాలని, పరిస్థితికి సంబంధించి కొన్ని విషయాలను చర్చించాలని, సాయం కావాలని లేఖలో పేర్కొన్నారు. యాదృచ్ఛికంగా, బాధితురాలి తల్లిదండ్రులు అత్యాచారం, హత్య విషాదంపై నిరసనగా జూనియర్ డాక్టర్ల గ్రూప్‌ను నిరాహార దీక్ష విరమించేందుకు ఒప్పించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.  

Tags:    

Similar News